About Me – Get to Know me and My Journey

About Me

infoCLIMB.com కి స్వాగతం.. సుస్వాగతం…
నమస్కారమండి, నా పేరు నాగబేబీ, నేను జేఎన్‌టీయూకె యూనివర్సిటీలో బి.టెక్ పూర్తి చేశాను. నేను గత 14 సంవత్సరాలుగా టీచర్ గా పని చేస్తున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి, సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే నాకు తెలిసిన పరిజ్ఞానంతో మన తెలుగు వారందరికీ ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిందే infoCLIMB.com.


నాకు తెలియని ఏదైనా విషయం గురించి గూగుల్ లో శోదించినపుడు లభించిన సమాచారంతో నేను చాలాసార్లు సంతృప్తి చెందలేదు. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు ఆ సమాచారాన్ని ఇతరులకు లభించేలా చెయ్యకూడదని అనిపించింది. అందరికి అవసరమైన చాలా సమాచారం గూగుల్ లో పూర్తి స్థాయిలో లభించడం లేదు. అందువల్ల మనకి కొన్నింటిని తెలుసుకోలేకపోయామనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. అందుచేత నాకు చేత అయ్యిన్నంతవరకు చేద్దాము అనే నా ఈ ప్రయత్నం.. తాపత్రయం కూడా.. అయితే దీనిని ఎలా మొదలు పెట్టాలి అనే నాలో సంధిగ్ధత నెలకొంది. అయితే చిన్నగా మొదలు పెట్టి అంచె అంచెలుగా అభివృద్ధి చేయాలనీ అనుకుంటున్నాను.

వినోదపరంగా కాకుండా కేవలం అందరికి జ్ఞానసముపార్జన చెయ్యాలని నా అభిలాష. మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా నాకు కామెంట్స్ రూపంలో కానీ కాంటాక్ట్ పేజీ ద్వారా కానీ నన్ను సంప్రదించండి. మీరు కోరుకున్న విలువైన సమాచారాన్ని అందించడానికి నా వంతు ప్రయత్నమూ చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను.

మన దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. ఈ రోజుల్లో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. నూట నలబై రెండు కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ కానీ మనకు వాటిపైన అవగాహనా తక్కువ. మనకు తెలియకుండా రోజు ఎన్నో జాబ్స్ పడుతుంటాయి కానీ మనకి పడ్డట్టు తెలియకపోవడం వల్ల, ఎలా అప్లై చెయ్యాలో తెలియక పోవడం వల్ల మనం వెనకపడిపోతాము. మనలో కొంతమంది మనకి ఏమొస్తుందిలే లైట్ తీసుకుంటారు. నాకు వస్తుంది, నేను చెయ్యగలను అనే నమ్మకం ఉంటే మనకి అవకాశాలు కోకొల్లలు. మన సమాజం బాగుంటే మనం బాగుంటాము, మన కుటుంబాలు బాగుంటాయి.

ముఖ్యంగా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మనకి అంది వచ్చిన ప్రతి అవకాశాలను ఉపయోగించుకుంటూ అంచె అంచెలుగా ఎదగాలి. కెరీర్ ప్రారంభంలోనే నాకు లక్షలు కావాలంటే రావు, మనలో స్కిల్స్ ని రోజు రోజుకీ పెంచుకుంటూ ఆటోమేటిక్ గా ముందుకు వెళతాము. మనం చేసేది చిన్న జాబ్ ,పెద్ద జాబ్ అనేది చూసుకోకూడదు, మన అనుభవాన్ని ఎలా పెంచుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి. ఫలానా జాబ్ చేస్తే చులకనగా చూస్తారు లాంటి వ్యతిరేక ఆలోచలను పక్కన బెట్టాలి. మనం చేసే జాబ్ మనకి నాలుగు వ్రేళ్లు లోపాలకి వెళ్లేలా చెయ్యాలి తప్ప వాళ్ళు ఏమి అనుకుంటారు వీళ్ళు ఏమి అనుకుంటారు లాంటివి ఆలోచనలు వద్దు.

మనకి మనం చేసే వృత్తి వల్లనే డబ్బులు వస్తాయి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. సహనం కోల్పోకుండా, నిరుత్సాహ పడకుండా ప్రతి జాబుకి అప్లై చేస్తే మనకి ఏదొక దాంట్లో మంచి అవకాశం వస్తుంది. మంచి కన్నా చేదు ముందు ఉంటుంది అంట, అంటే నిజమైన జాబ్స్ కంటే చాలా వెబ్సైట్ లో ఫేక్ జాబ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి నిరుత్సాహం వస్తుంది. అందుకే నిజమైనవి సరైనవి మంచివి అనిపిస్తేనే నేను ఈ వెబ్సైటు లో పోస్ట్ చేస్తాను. మీకు నేను పెట్టే జాబ్స్ లో ఎటువంటి సందేహాలు ఉన్న సరే అక్కడే కామెంట్ రూపంలో తెలియజేయగలరు, నేను వాటికీ త్వరితగతిన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

జైహింద్!

Thank you for reading. If you have any queries, please contact us.