Wedding anniversary wishes in Telugu

Nagababy

Updated on:

wedding anniversary wishes in telugu

Here is a list of wedding anniversary wishes in Telugu

జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. అందులో భార్య భర్తల బంధం ఎంతో విలువైనది ముఖ్యమైనది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉండే అపూర్వ బంధం. కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు అండగా ఉంటూ సంసారం అనే సాగరాన్ని ఇద్దరు కలసి ఈదుతారు. ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ ఇద్దరు ఒకరికి ఒకరు సర్దుకు పోతూ జీవితాన్ని పంచుకుంటారు. పెళ్లి రోజు అనేది భార్యాభర్తలకు ఒక మరపురాని రోజు. ఆ రోజును వారు ఒక పండగలా జరుపుకుంటారు. మరి ఆ ఆలుమగలుకు ప్రత్యకంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా వారిదైనా రోజున వారిని మరింత సంతోషపెట్టినవారము అవుతాము. కాబట్టి ఇక్కడ ఉన్న సందేశాలను(wedding anniversary wishes in Telugu) వారికీ పంపి ఆనందింప చేద్దాము.

  • ఆదర్శ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
  • మీ జంట అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 
  • ఒకరికొకరు మీ ప్రేమ శాశ్వతం గా ఉండాలని కోరుకుంటున్నాను సంతోషకరమైన మరియు కష్టం సుఖంలో ఒకరికొకరు తోడుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ…. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
  •  మీ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 
  • మీ దంపతులు అవధుల్లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 
  • ఎన్నేళ్లు గడిచినా చెదరని మీ బంధం ఇలాగే నిలవాలి కలకాలం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
  • మీ దంపతులు అనునిత్యం సుఖసంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 
  • కనువిందైన మీ జంట అన్యోన్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా వెలుగొందాలని ఆశిస్తూ… హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
  • మీ జీవితంలో కలల్ని నెరవేర్చుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే సుఖసంతోషాలతో మీ బంధం బలపడేలా ఉండాలని కోరుకుంటూ… పెళ్లి రోజు శుభాకాంక్షలు 
  • మీరు మీ జ్ఞాపకాల తో అద్భుతమైన వివాహ వేడుకలు జరుపుకోవాలని మీ బంధంలో ఒకరినొకరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ… హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు 
  • ఒకరికొకరు మీ ప్రేమ శాశ్వతం గా ఉండాలని కోరుకుంటున్నాను సంతోషకరమైన మరియు కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
  • ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
  • కోరుకున్న ఇంతి నేడు నీ సతి, నేడు పట్టుకున్న ఆమె చేయి విడువడు ఎన్నటికి హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
  • మమతానురాగాల తెరచాపగా ఆప్యాయతే ఆలంబనగా మీ సంసార నౌక సాగాలని ఆశిస్తూ మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
  • ఆదర్శప్రాయంగా నిలవాలి మీ జంట నవ్వులే  కురియాలి మీ ఇంట పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  • ఒక్కటైనా రెండు మనసులకు మూడుముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీతో నడవగా పంచభూతాలు పల్లకి కాగా 6 జన్మలకు తోడు ఉంటామంటూ ఏడడుగులు వేయగా అష్టదిక్పాలకులు ఆశీర్వదించగా నవగ్రహాలు నెలవై ఉన్న ఈ పచ్చని పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా పది కాలాల పాటు కలిసి ఉండాలి మీరు పదిమంది మెచ్చుకునేలా… పెళ్లి రోజు శుభాకాంక్షలు
  • ఏళ్ళు గడిచినా చెదరని మీ బంధం ఇలాగే నిలవాలి కలకాలం అదే మాకు ఆనందం. పెళ్లిరోజుశుభాకాంక్షలు
  • కలిమిలేములతో కలిసిన మనసులతో కలివిడిగా మసలుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో పెళ్లిరోజుశుభాకాంక్షలు
  • సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీ దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Thank you for reading wedding anniversary wishes in Telugu. If you have any queries, please contact us.

Leave a Comment